close

గ్రేటర్‌ హైదరాబాద్‌

తెలంగాణపై భాజపా వివక్ష  

పైసా సాయం చేయలేదు: బాల్కసుమన్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణపై భాజపా అడుగడుక్కీ వివక్ష ప్రదర్శిస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ధ్వజమెత్తారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పైసా సాయం అందించలేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వంటి నేతలకు తెలంగాణపై మాట్లాడే హక్కే లేదని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘భాజపా తెలంగాణ వ్యతిరేక ధోరణితో ఉంది. ఉద్యమ సమయంలోనూ ఆ పార్టీ గోడ మీది పిల్లిలా వ్యవహరించింది. 2014లో తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించే సందర్భంలో ఆటంకాలు కల్పించింది. రాజ్యసభలో సవరణల పేరిట అడ్డుకునేందుకు కుట్రలు చేసింది. తెలంగాణ మీద ఏరోజు భాజపాకు చిత్తశుద్ధి లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నిజస్వరూపం బయటపడింది. అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడమే దాని ధ్యేయం. తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తుంటే ఒక్క పథకానికి, ప్రాజెక్టుకు సాయం చేయలేదు. కాళేశ్వరానికి ప్రత్యేక హోదాను కోరితే పట్టించుకోలేదు’’ అని సుమన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు