close

తెలంగాణ

పశ్చిమబెంగాల్లో కొత్త పొత్తులు!

దిల్లీ: భాజపా దూకుడును పశ్చిమబెంగాల్‌లో కట్టడి చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉభయ పార్టీల నాయకుల మధ్య గత కొద్దిరోజులుగా అనధికారికంగా సమావేశాలు, చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో టీఎంసీ చీఫ్‌విప్‌ కల్యాణ్‌ బెనర్జీతో దాదాపు అరగంట సేపు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై కళ్యాణ్‌ బెనర్జీ వివరణ ఇస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు టీఎంసీ పట్ల వ్యతిరేకతను కనబరుస్తున్న విషయాన్ని రాహుల్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం కూడా లోక్‌సభలో టీఎంసీ పక్ష నాయకుడు సుదీప్‌ బంధోపాధ్యాయతో సమావేశమై ఇవే అంశాలపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. 2021లో రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ పునరాలోచించుకోవడం అవసరమని పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో భాజపాను ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు