close

క్రైమ్

క్రికెట్‌ ఆటలో వివాదం ఒకరి ప్రాణం తీసింది

విశాఖపట్నం (మాధవధార), న్యూస్‌టుడే: ఇద్దరు స్నేహితుల మధ్య క్రికెట్‌ ఆటలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర సంఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని కరాస ప్రాంతంలో.. ఎం.విజయ్‌ (13), అతని స్నేహితుడు (14) ఆదివారం క్రికెట్‌ ఆడుతూ తగువు పడ్డారు. విజయ్‌ అప్పటికే  రెండు మ్యాచ్‌లు గెలిచి, మూడో మ్యాచ్‌ గెలిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో రెండో వ్యక్తి చేతిలో ఉన్న క్రికెట్‌ బ్యాట్‌తో విజయ్‌ పొట్టలో పొడిచాడు. దీంతో లోపలి పేగుల్లో రక్త ప్రసరణ నిలిచి పోయి విజయ్‌ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తక్షణం అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి విజయ్‌ మృతి చెందాడు. బాధితుని కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు