close

గ్రేటర్‌ హైదరాబాద్‌

పదోన్నతులపై కాలయాపనొద్దు: టీటీఎఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఏకీకృత సర్వీసు నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయుల సమాఖ్య(టీటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇ.రఘునందన్‌  మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జగన్నాథం, ఉపాధ్యక్షులు రాజయ్య, కిషన్‌రావు, భుజంగరావు, కనకయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు