close

గ్రేటర్‌ హైదరాబాద్‌

పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై నమూనా లెక్కల సేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలపై నీటిపారుదల శాఖ నమూనా లెక్కలు సేకరించింది. రెండు రోజుల పాటు సేకరించిన వివరాల్లో రోజుకు 40 వేల క్యూసెక్కులు విడుదలవుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దస్త్రాల్లో 28 వేల క్యూసెక్కులు మాత్రమే నమోదు చేస్తుండటంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో చర్చించినట్లు తెలిసింది. బోర్డు అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు సీఈ నారాయణరెడ్డిని వివరణ కోరగా.. ప్రాజెక్టులోకి భారీ ప్రవాహం ఉన్న సమయంలో నిర్వహణలో భాగంగా పోతిరెడ్డిపాడు గేట్లు పూర్తిగా తెరిచి నీటిని విడుదల చేయడంతో ప్రవాహం ఎక్కువగా నమోదయి ఉంటుందని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేస్తూ గిరిజన సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన గల ఈ మండలిలో 20 మంది సభ్యులుంటారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు