close

తెలంగాణ

27 నుంచి ఎయిమ్స్‌ తరగతుల ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 2019-20 వైద్యవిద్య సంవత్సరం నుంచి 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ఇక్కడ తరగతులు నిర్వహించనున్నారు. భోపాల్‌ ఎయిమ్స్‌ సంచాలకులే ఇక్కడి ఎయిమ్స్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బోధనా సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేశారు. బీబీనగర్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న నిమ్స్‌ ఓపీ సేవలు ఇక నుంచి ఎయిమ్స్‌కు అనుబంధ ఆసుపత్రి సేవలుగా రూపాంతరం చెందుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా వసతిగృహాల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తయింది. తొలి సంవత్సరం వైద్యవిద్య తరగతుల నిర్వహణకు అవసరమైన ప్రయోగశాలలు, తరగతి గదుల వసతులను పర్యవేక్షించడానికి మంగళవారం భోపాల్‌ నుంచి వచ్చిన ఉన్నత స్థాయి ఇంజినీర్ల బృందం బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవనాన్ని సందర్శించింది. ఈ నెలాఖరు నుంచి తరగతుల ప్రారంభానికి అవసరమైన వసతులపై ఇంజినీర్ల బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బుధవారం వీరు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డిని కలిసి తరగతుల నిర్వహణపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు