close

గ్రేటర్‌ హైదరాబాద్‌

వారసత్వ గుర్తింపు కోసం ఏం చేద్దాం?

రామప్పను సందర్శించిన కేంద్ర పురావస్తు శాఖ
25న రానున్న యునెస్కో బృందం

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అణువణువూ పరిశీలించారు. ప్రపంచ వారసత్వ హోదా కోసం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం నామినేట్‌ కావడంతో ఈ నెల 25న యునెస్కో బృందం రానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ సంయుక్త సంచాలకుడు నంబిరాజన్‌, సూపరింటెండెంట్‌ మిలాన్‌కుమార్‌ చౌలే, వరల్డ్‌ హెరిటేజ్‌ ట్రస్టు డైరెక్టర్‌ పీ.కే.మిశ్రా, కోమల రామప్ప ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. ఎలాంటి సదుపాయాలుంటే యునెస్కో గుర్తింపు వస్తుంది? ఇందుకు చేపట్టాల్సిన చర్యలు? ప్రస్తుతమున్న సౌకర్యాలు ఏమిటి? సమస్యలు ఉన్నాయా? ఇన్నిసార్లు యునెస్కో పోటీలో ఉండి కూడా గుర్తింపు పొందకపోవడానికి కారణాలేంటి? వాటిని ఎలా పరిష్కరించాలి? అనే విషయాలపై ఆరా తీశారు. పునఃనిర్మాణం కోసం విప్పి కుప్పపెట్టిన కామేశ్వరాలయం, రెండేళ్ల క్రితం వర్షాలకు కూలిన ప్రహరీని పరిశీలించారు. ప్రహరీ నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారు. కామేశ్వరాలయం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పర్యాటకులు ఎటు నుంచి వస్తున్నారు? ఎటు నుంచి వెళ్తున్నారు? ఆ దారుల పరిస్థితిపై ఆరాతీశారు. ఆలయ ప్రాంగణంలో సమకూర్చాల్సిన సదుపాయాలపై చర్చించారు. నీటిపై తేలే ఇటుకలను స్వయంగా పరిశీలించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు