close

గ్రేటర్‌ హైదరాబాద్‌

4,590 నీటి వనరుల్లోకి చేప పిల్లలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ సారి తొలివిడత కింద 4,590 నీటి వనరుల్లో చేప పిల్లలు వదలనున్నారు. మొత్తంగా 24,189 నీటి వనరుల్లో 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలు వదలాలనేది ఈ ఏడాది లక్ష్యం. కాగా నైరుతి రుతుపవనాల ఆలస్యంతో ఇప్పటి వరకు 4,590 చెరువులు, కుంటల్లోనే మూడోవంతుకు మించి నీరు చేరింది. దీంతో నిబంధనలను అనుసరించి వాటిలోనే చేపపిల్లలు వదులుతామని మత్స్యశాఖ స్పష్టంచేసింది. మిగిలిన వనరుల్లోకి నీరువచ్చాక విడతలవారీగా చేపపిల్లలు సరఫరా చేస్తామని పేర్కొంది.
ఈ నెల 16వ తేదీన అన్ని జిల్లాలు చేప పిల్లల పంపిణీని ప్రారంభించాలని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు వీటి పంపిణీలో భాగస్వాములు కావాలని మంగళవారం ఆయన లేఖలు రాశారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన మత్స్యశాఖ.. ఏర్పాట్లను పూర్తి చేసింది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు