close

తెలంగాణ

భద్రతపై రాజీ వద్దు

వరదలప్పుడు ముందు జాగ్రత్తలతో రైళ్లు నడపాలి: జీఎం

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలు, వరదల నేపథ్యంలో రైళ్లను సాఫీగా నడపడానికి అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మల్య అధికారుల్ని ఆదేశించారు. రైలు వంతెనలు, సొరంగాలు, చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆరు డివిజన్ల ఉన్నతాధికారులతో సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయం నుంచి జీఎం మంగళవారం... వర్షాకాలంలో తలెత్తే ఇంజినీరింగ్‌, సిగ్నలింగ్‌ వైఫల్యాలపై సమీక్షించారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళిక తయారుచేయాలని డీఆర్‌ఎంలను ఆదేశించారు. రైల్వేస్టేషన్లలో కూడా విమానాశ్రయాలలో మాదిరి లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని ద.మ.రైల్వే నిర్ణయించింది.

హైదరాబాద్‌-రామేశ్వరం మధ్య 20 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌-రామేశ్వరం మధ్య గుంటూరు, రేణిగుంట మార్గంలో 20 ప్రత్యేకరైళ్లు (నెం.07685/07686) నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌ నుంచి ఆగస్టు 23, 30.. సెప్టెంబరు 6, 13, 20, 27.. అక్టోబరు 4, 11, 18, 25 తేదీల్లో.. తిరుగుప్రయాణంలో రామేశ్వరం నుంచి ఆగస్టు 25, సెప్టెంబరు 1, 8, 15, 22, 29.. అక్టోబరు 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేకరైళ్లు బయల్దేరుతాయని సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు