close

గ్రేటర్‌ హైదరాబాద్‌

తెలంగాణకు రూ.50 వేల జరిమానా

మానవ హక్కుల కోర్టుల వివరాలు సమర్పించకపోవటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దిల్లీ: మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుకు తీసుకున్న చర్యల వివరాలను అందచేయని తెలంగాణ సహా 7రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం జరిమానా విధించింది. రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు రూ.లక్ష చొప్పున తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మేఘాలయ, మిజోరంలు రూ.50వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రాష్ట్రాల్లో మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు అందజేయాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది.జరిమానా సొమ్మును కోర్టులో జమ చేసి 4 వారాల్లోగా వివరాలు సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు