close

తెలంగాణ

డా.సి.గోపాలన్‌కు లివింగ్‌ లెజెండ్‌ అవార్డు

ఈనాడు, హైదరాబాద్‌: పోషకాహార రంగంలో పితామహుడిగా పేరొందిన డాక్టర్‌ కొలుతూర్‌ గోపాలన్‌కు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియన్‌ న్యూట్రిషన్‌ సొసైటీ (ఎఫ్‌ఏఎన్‌ఎస్‌) లివింగ్‌ లెజెండ్‌ అవార్డును అందజేసింది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన 13వ ఆసియన్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సదస్సులో గోపాలన్‌ తరఫున ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త  ఎం.జి.సుబ్బారావు ఈ అవార్డును అందుకున్నారు. చెన్నైలో నివాసముంటున్న ఆయనకు దీన్ని అందజేయనున్నట్లు తెలిపారు. గతేడాది వందేళ్లు పూర్తి చేసుకున్న గోపాలన్‌ పోషకాహార రంగంలో విశేష సేవలు అందించారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)కు 1961 నుంచి 1973 వరకు సంచాలకులుగా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌ - భారత వైద్య పరిశోధన మండలి)కు 1974 నుంచి 1979 వరకు డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. సమీకృత శిశు అభివృద్ధి పథకం రూపకల్పనతోపాటు విటమిన్‌-ఏ, ఐరన్‌ లోపాలను సరిదిద్ది.. జాతీయ పోషకాహార విధానాలను రూపొందించడంలో ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు