close

గ్రేటర్‌ హైదరాబాద్‌

గాయత్రి పంపుహౌస్‌లో రెండు పంపుల వెట్‌రన్‌

రామడుగు, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌస్‌లో రెండు బాహుబలి మోటార్లను అధికారులు ఒకేసారి నడిపి ఎత్తిపోతలను విజయవంతం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద ఇంజినీరింగ్‌ అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించి వెట్‌రన్‌ నిర్వహించారు. మొదట ఐదో పంపును అరగంట నడిపిన అనంతరం నిలిపివేసి మరో అరగంటకు నాలుగో పంపుతో సర్జిపూల్‌ నుంచి ఎత్తిపోతలు చేపట్టారు. అనంతరం రాత్రి 10.30 నిమిషాలకు నాలుగు, ఐదో పంపులను ఒకేసారి నడిపారు. నందిమేడారం పంపుహౌస్‌ నుంచి 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో ఆ మేరకు రెండు పంపులతో అంతే మొత్తాన్ని గాయత్రి పంపుహౌస్‌ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎత్తిపోశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు