close

జాతీయ- అంతర్జాతీయ

అవసరమైతే అఫ్గాన్‌ వైపు నుంచి బలగాల తరలింపు: పాక్‌

న్యూయార్క్‌: భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల వెంబడి ఉన్న తన బలగాలను నియంత్రణ రేఖ వద్దకు పాకిస్థాన్‌ తరలించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికాలో పాక్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ తెలిపారు. అఫ్గాన్‌లో అమెరికా, తాలిబన్ల మధ్య జరుగుతున్న చర్చలను ఇది సంక్లిష్టం చేయవచ్చని అమెరికా పత్రిక ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఈ శాంతి చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌, పాక్‌ల మధ్య గత వారం రోజులుగా పెద్దగా సంప్రదింపులు జరగలేదని మజీద్‌ ఖాన్‌ చెప్పారు. అందువల్ల పరిస్థితులు సంక్లిష్టమయ్యే అవకాశం ఉందన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు