close

జాతీయ- అంతర్జాతీయ

‘తెలంగాణ చిన్నమ్మ’కు దిల్లీలో నివాళి

ఈనాడు, దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలంగాణ చిన్నమ్మగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆమె సంస్మరణార్థం మంగళవారం దిల్లీలో ఏర్పాటైన సభలో మాట్లాడుతూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా తనను చిన్నమ్మగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఆమె కోరారన్నారు.

రహదారులపై ‘నామా’కు లేఖ 
జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఒక లేఖ రాశారు. తెలంగాణలోని 5 రాష్ట్ర రహదారులను ఇక జాతీయ హైవేగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని రహదారుల అభివృద్ధి డైరెక్టర్‌ జనరల్‌కు సూచించామని అందులో తెలిపారు. చౌటుప్పల్‌-ఆమన్‌గల్‌-షాద్‌నగర్‌-కంది, హైదరాబాద్‌-వలిగొండ-తొర్రూర్‌-కొత్తగూడెం, మెదక్‌ -ఎల్లారెడ్డి-రుద్రూర్‌, బోధన్‌-బాసర-భైంసా, మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకటించాలంటూ నామా గతంలో విన్నవించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు