close

జాతీయ- అంతర్జాతీయ

పార్లమెంటు భవనానికి కొత్త వెలుగులు

దిల్లీ: భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు దేవాలయం లాంటి పార్లమెంటు భవనం స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కొత్త వెలుగులతో భాసిల్లుతోంది. ఈ మేరకు నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక విద్యుత్తు దీపాల వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు భవనానికి ఉన్న 144 స్తంభాలకు మొత్తం 875 ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాలను అమర్చామని, ఇవి ప్రతి కొన్ని సెకన్లకు విభిన్న కాంతులు వెదజల్లుతాయని లోక్‌సభ సచివాలయం పేర్కొంది. ఈ దీపాలు సాధారణ దీపాలతో పోల్చితే ఐదో వంతు విద్యుత్తుతో పనిచేస్తాయని వివరించింది. సౌత్‌, నార్త్‌ బ్లాక్‌లు, రైసినా హిల్స్‌లలో కూడా ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటుచేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు