close

జాతీయ- అంతర్జాతీయ

కేరళలో జలఖడ్గం 

91కి చేరిన వరద మృతుల సంఖ్య 
ఒడిశాలోనూ ఎడతెరపి లేని వర్షాలు

దిల్లీ: ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన కేరళకు మళ్లీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, అలప్పుజ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం మంగళవారం ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య 91కి చేరింది. గుజరాత్‌, కర్ణాటకల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాస్త ఉపశమనం కనిపించింది. దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలో వరద బాధితులకు స్థానిక యంత్రాంగం నిత్యావసరాలు, ఆహార పంపిణీ చేపడుతోంది. ఇప్పటికే దారుణంగా దెబ్బతిన్న కొల్హాపుర్‌, సంగ్లీతో పాటు సతారా జిల్లాలోనూ బుధవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. ఒడిశాలోనూ ఎడతెరపి లేకుండా  వర్షాలు పడుతున్నాయి.

మోదీకి రాహుల్‌ లేఖ 
వయనాడ్‌ నియోజకవర్గంలో వరద ప్రమాద హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఓ లేఖలో కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు