close

సినిమా

విజయశాంతిలా పేరు తెచ్చుకోవాలి

తేజస్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. శంకర్‌ భాను దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ ‘‘కథ బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతారు సి.కల్యాణ్‌. భాను నాతో పాటే కలిసి పనిచేశాడు. తనకు ఈ సినిమాతో మంచి విజయం దక్కుతుందనిపిస్తోంది. విజయశాంతిలా పాయల్‌రాజ్‌పుత్‌ మంచి పేరు తెచ్చుకోవాల’’న్నారు. ‘‘యుక్త వయసులో ఉన్న ఓ అమ్మాయి జీవితాన్ని ఆస్వాదించే సమయంలో, తన కోరికల్ని పక్కన పెట్టి ఊరు కోసం ఏం చేసిందో హృదయాన్ని తాకేలా చూపిస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత. ‘‘ఆర్‌ఎక్స్‌ 100’తో నా జీవితం మారిపోయింది. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంద’’న్నారు పాయల్‌. ‘‘పాయల్‌, తేజస్‌ జంట ఆకట్టుకుంటుంది. సాంకేతిక పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంద’’న్నారు దర్శకుడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు