close

క్రీడలు

భిన్నాభిప్రాయాలుంటే గొడవేనా?

కోహ్లి-రోహిత్‌ సంబంధాలపై రవిశాస్త్రి

దుబాయ్‌: ఒక జట్టులో ఏ ఇద్దరి మధ్య అయినా ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు సహజమని, అంతామాత్రాన ఆ ఇద్దరి మధ్య గొడవ ఉన్నట్లు కాదని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. కోహ్లి, రోహిత్‌ల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఇలా స్పందించాడు. ‘‘నేను దాదాపు అయిదేళ్లుగా ఈ జట్టుతో ఉన్నా. ఎవరు ఎలా ఆడుతున్నారో.. ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారో నాకు బాగా తెలుసు. జట్టు సభ్యుల గురించి జరుగుతున్న ప్రచారం అర్థరహితం. కోహ్లితో రోహిత్‌కు విభేదాలుంటే ప్రపంచకప్‌లో అతడితో భాగస్వామ్యాలు నెలకొల్పేవాడా, 5 సెంచరీలు చేసేవాడా? ఒక జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నపుడు ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. అది అవసరం కూడా’’ అని రవిశాస్త్రి చెప్పాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు