close

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు రొట్టెల పండగ ప్రారంభం

టా ప్రతిష్ఠాత్మకంగా ఐదురోజుల పాటు జరిగే నెల్లూరు రొట్టెల పండగ మంగళవారం ప్రారంభమైంది. వేకువజాము నుంచే రొట్టె పట్టేందుకు భక్తులు పోటెత్తడంతో స్వర్ణాల చెరువు జనంతో నిండిపోయింది. వాహనాలు, యాత్రికులు, భక్తులతో సింహపురి వీధులు కిక్కిరిసిపోగా, బారాషహీద్‌ దర్గా ప్రాంగణం జనసంద్రంగా మారింది. సౌభాగ్య, ఆరోగ్య, సంతాన, కల్యాణ, విద్య తదితర రొట్టెలు ఇక్కడ మార్పిడి అవుతున్నాయి. మంగళవారం షహదత్‌ సందర్భంగా బారా షహీదులకు సుగంధ ద్రవ్యాలతో సొందల్‌ మాలి నిర్వహించి రొట్టెల పండగ ప్రారంభించారు. 11న గంధోత్సవం నిర్వహిస్తారు. 12న రొట్టెల పండగ జరుపుతారు. 13న తహలీల్‌ ఫాతెహా జరుగుతుంది. 14వ తేదీతో కార్యక్రమం ముగియనుంది. - నెల్లూరు, ఈనాడు


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు