close

గ్రేటర్‌ హైదరాబాద్‌

ఆకులో  ఇ‘మిడితా’

కులాంటి దేహంతో ఆకట్టుకుంటోన్న ఈ మిడత మంగళవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో కనిపించింది. ప్రత్యేకంగా ఉన్న ఈ మిడత విశేషాలు తెలుసుకుందామని మధిర వ్యవసాయ శాస్త్రవేత్త డా.శ్రీనివాస్‌ని సంప్రదిస్తే బోలెడు విషయాలు చెప్పారు. క్యాటీడిడ్‌ తెగకు చెందిన ఈ గ్రాస్‌హూపర్‌ని బుష్‌ క్రికెట్‌ అంటారు. పచ్చదనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపించే ఈ కీటకాలు పచ్చని ఆకులపై వాలి.. ఈనలు మినహా మిగతా భాగాన్నంతా తినేస్తాయి. దీంతో ఇవి వాలిన తర్వాత ఆకులు ఈనలు మాత్రమే మిగిలి అస్తిపంజరాల్లా కనిపిస్తాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ మిడతలు పాడతాయట. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి సమయంలో, శత్రువులతో పోరాడేప్పుడు పాటలు పాడినట్లు ప్రత్యేక శబ్దాలు చేస్తాయట!

- న్యూస్‌టుడే, మధిర

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు