close

గ్రేటర్‌ హైదరాబాద్‌

గ్రామీణ వైద్యం బలోపేతం

వైద్య సిబ్బందికి ఆధునిక శిక్షణ
కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు
ఎకో ట్రస్టుతో పరస్పర ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ వైద్యాన్ని పటిష్ఠపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాలను ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు’గా తీర్చిదిద్దాలని ఇప్పటికే నిర్ణయించిన కేంద్రం.. ఇందులో భాగంగా పల్లె వైద్యంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి అవసరమైన ఆధునిక శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది. ఇందుకోసం ‘ఎకో(ఎక్స్‌టెన్షన్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌కేర్‌ ఔట్‌కమ్స్‌) ట్రస్టు’తో ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ‘ఎకో ట్రస్టు’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వేర్వేరు స్థాయుల్లో వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు క్షేత్రస్థాయిలో వందశాతం అమలయ్యేలా వైద్య సిబ్బందిని ప్రేరేపించడంలో ‘ఎకో’ కీలక పాత్ర పోషించనుంది.

లక్ష్యమిదే..
* ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడమే  ప్రధాన లక్ష్యం
* కేంద్రం రూపొందించిన పథకాలను పటిష్ఠంగా అమలుపర్చేలా చేయడం
* ప్రజలకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలందించడం
* క్లిష్టతరమైన వ్యాధులను త్వరితగతిన గుర్తించడం
* గ్రామీణ ప్రజలకు వైద్యసేవలను చేరువగా    తీసుకెళ్లడం
* ఆరోగ్య సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం
* ఈ లక్ష్య సాధనలో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది సేవలను సమర్థంగా వినియోగించుకోవడం
* వైద్యసిబ్బందికి ఎప్పటికప్పుడూ శిక్షణ తరగతులు నిర్వహించడం
* ప్రతి అంశానికి సంబంధించిన సమాచారాన్ని   డిజిటల్‌లో పొందుపర్చడం


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు