close

గ్రేటర్‌ హైదరాబాద్‌

భువనచంద్రుడు

తెదేపా అధినేత చంద్రబాబు పెళ్లిరోజు సందర్భంగా ఆయన తనయుడు లోకేష్‌ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ రోజు అమ్మానాన్నల పెళ్లి రోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్న జీవితంలో నిజం చేస్తూ, ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి..అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖ సంతోషాలతో నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు’’ అని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇటీవల ఐరోపాలో పర్యటించినప్పుడు తీసిన ఓ ఫొటోని ఆయన తన ట్వీట్‌కి జతచేశారు.

- ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు