close

క్రైమ్

నకిలీ వేలిముద్రల కేసులో కానిస్టేబుళ్ల పాత్ర

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: నకిలీ వేలిముద్రల తయారీ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమంలో నెల్లూరుకు చెందిన ఇద్దరు పోలీసుల పాత్ర ఉందని తెలియవచ్చింది. పట్టణ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. నకిలీ వేలిముద్రలతో పాస్‌పోర్టు, ఆధార్‌కార్డులు తయారుచేస్తున్న ముఠా సభ్యుల్లో ఐదుగురిని ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. లోతుగా దర్యాప్తు చేయగా నెల్లూరుకు చెందిన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల ప్రమేయం ఇందులో ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో నిందితులు జి.శ్రీనివాసరెడ్డి, ఎన్‌.వెంకటయ్యలను అరెస్ట్‌ చేసి నరసాపురానికి తరలించినట్లు సీఐ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు