close

క్రైమ్

చనిపోయిందా.. చంపేశారా?

సౌదీలో మహిళ అనుమానాస్పద మృతి

ఈనాడు- నెల్లూరు, న్యూస్‌టుడే, మర్రిపాడు: నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ సౌదీలోని రియాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మర్రిపాడు మండలం చాబోలుకు చెందిన రమణమ్మ (35) భర్త మరణించడంతో పిల్లలు, తల్లిదండ్రులను పోషించడానికి రెండున్నరేళ్ల క్రితం సౌదీ వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నారు. నాలుగైదు నెలలకోసారి కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి మాట్లాడేవారు గానీ, ఏడాది నుంచి ఫోన్‌ లేదు. నాలుగు నెలల క్రితం రమణమ్మ తన తండ్రికి చివరిసారి ఫోన్‌ చేసి యజమాని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పినట్లు సమాచారం. తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా యజమాని, ఏజెంట్‌ ఒప్పుకోవడం లేదని ఆమె వెల్లడించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈలోపే ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉన్నట్లు తెలిసింది. రమణమ్మను యజమానే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం నుంచి వెళ్లి, అక్కడ పనిచేసుకుంటున్నవారే రమణమ్మ మృతి సమాచారాన్ని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు