close

జాతీయ- అంతర్జాతీయ

పీఓకే పైనే పాకిస్థాన్‌తో చర్చలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

దిల్లీ: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశంపైనే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన సర్పంచులు, పంచాయతీ సభ్యుల బృందం దిల్లీలో మంగళవారం ఆయనను కలసింది. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 74శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో 370వ అధికరణాన్ని రద్దు చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. స్థానిక సంస్థలను కూడా బలోపేతం చేసే వీలు కలిగిందన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు