close

సినిమా

‘నిశ్శబ్దం’లో అనుష్కను చూశారా..!

తన పెయిటింగ్స్‌ మాట్లాడతాయి కానీ, తను మాట్లాడలేదు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయిక అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాకి సంబంధించి అనుష్క ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా నేడు అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు ‘సాక్షి’. ఈ విషయాన్ని తెలియాచేస్తూ.. పోస్టర్‌పై ‘‘సాక్షి’ ఏ మ్యూట్‌ ఆర్టిస్ట్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. 
‘భాగమతి’ హిట్‌ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ చిత్రానికి మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్మొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో విడుదలైన ఈ టైటిల్‌ పోస్టర్‌ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు