close

సినిమా

బందోబస్త్‌కి రంగం సిద్ధం

చిత్రసీమ జయాపజయాలకే విలువ ఇస్తుంది. హిట్టు వెంటే పడుతుంది. కేవలం ప్రతిభనే నమ్మి అవకాశాలిచ్చే కథానాయకులు  అరుదుగా కనిపిస్తుంటారు. ఆ జాబితాలో సూర్య ఒకరు. ఆయన కెరీర్‌ అంతా ప్రయోగాలమయమే. అయితే... వాణిజ్య అంశాల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం, ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడం సూర్యకి ఇష్టం. ‘రంగం’తో తన స్టైల్‌ ఏమిటో  చూపించారు కె.వి.ఆనంద్‌. ఆయన కథలన్నీ కొత్త పంథాలో సాగుతాయి. అందుకే సూర్యకు ఆయనంటే గురి. ఇది వరకు సూర్యతో ‘అయర్‌’, ‘మాట్రాన్‌’లాంటి చిత్రాల్ని అందించారు ఆనంద్‌. ఇప్పుడు ‘బందోబస్త్‌’ చేశారు. శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా సెట్లో సూర్య, ఆర్యలకు సన్నివేశాన్ని వివరిస్తూ బిజీగా కనిపించారు ఆనంద్‌. ఈ చిత్రంలో  మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్ర చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు