close

బిజినెస్‌

ఆర్‌ఐఎల్‌లో ముకేశ్‌ వాటా పెరగలేదు

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రమోటర్‌, ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కొత్తగా షేర్లను కొనుగోలు చేయలేదని, సంస్థలో ఆయన వాటా ఏమీ పెరగలేదని కంపెనీ వెల్లడించింది. ఈ నెల 17న కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని వివరించింది. వాస్తవానికి ప్రమోటర్‌/ప్రమోటర్‌ గ్రూపులో భాగమైన పెట్రోలియం ట్రస్టు నియంత్రణలోని రిలయన్స్‌ సర్వీసెస్‌ అండ్‌ హోల్డింగ్స్‌ అమరిక పథకంలో (స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌) భాగంగా 17.19 కోట్ల ఆర్‌ఐఎల్‌ ట్రెజరీ షేర్లను (2.71 శాతం) కొనుగోలు చేసినట్లు పేర్కొంది. అయితే కొనుగోలుకు సంబంధించి ఎలాంటి లావాదేవీ జరగలేదని గురువారం ఆర్‌ఐఎల్‌ వివరణ ఇచ్చింది. ‘41.28 కోట్ల ఆర్‌ఐఎల్‌ ట్రెజరీ షేర్లు రెండు భాగాలుగా పెట్రోలియం ట్రస్టు (24.09 కోట్ల షేర్లు), అనుబంధ సంస్థల (17.19 కోట్ల షేర్లు) వద్ద ఉన్నాయి. ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థల అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా 5 సంస్థల వద్ద ఉన్న 17.19 కోట్ల షేర్లను రిలయన్స్‌ సర్వీసెస్‌ అండ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఎస్‌హెచ్‌ఎల్‌) సంస్థలో విలీనం చేశామ’ని ఆర్‌ఐఎల్‌ వివరించింది. అందువల్ల ఆర్‌ఐఎల్‌లో ముకేశ్‌ అంబానీ వాటా ఏమీ పెరగలేదని పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు