close

సినిమా

వెంకీమామ హంగామా

మామా అల్లుళ్ల మధ్య ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? మామ కోసం అల్లుడు, అల్లుడుతో మామ ఉంటే... ఆ బలమే వేరు. వెంకటేష్‌, నాగచైతన్య కూడా మామా అల్లుళ్లే. ‘ప్రేమమ్‌’ కోసం తెరపై వీరిద్దరూ కాసేపు కనిపించారంతే. థియేటర్లు హోరెత్తిపోయాయి. ఇప్పుడు ఏకంగా కథ మొత్తం వీళ్ల మధ్యే  తిరగబోతోంది. వెంకీ, చైతూ తమ నిజ జీవిత పాత్రల్ని పోషిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌ నాయికలు. బాబీ దర్శకుడు. సురేష్‌బాబు, విశ్వప్రసాద్‌ నిర్మాతలు. ఒక పాట మినహా  చిత్రీకరణ పూర్తయింది. దసరాకు విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు టీజర్‌ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు