close

క్రీడలు

ప్రపంచ స్నూకర్‌ క్వార్టర్స్‌లో పంకజ్‌ అడ్వాణీ

మందాలయ్‌ (మయన్మార్‌): భారత క్యూ స్టార్‌ పంకజ్‌ అడ్వాణీ జోరు కొనసాగుతోంది. ఇటీవల ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి రికార్డు స్థాయిలో 22వ టైటిల్‌ అందుకున్న అతను.. తాజాగా ప్రపంచ 6- రెడ్‌ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ దూసుకెళ్తోన్నాడు. గురువారం మ్యాచ్‌లో పంకజ్‌ 5-2 తేడాతో జుల్ఫికర్‌ ఖాదిర్‌ (పాకిస్థాన్‌)పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరోవైపు లక్ష్మణ్‌ రావత్‌.. యాంగ్‌ (చైనా)పై, పుష్పేందర్‌ సింగ్‌ 5-4తో కృత్సానుత్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరారు. క్వార్టర్స్‌ పోరులో తనవాత్‌ (థాయ్‌లాండ్‌)తో పంకజ్‌, చెంగ్‌ (హాంకాంగ్‌)తో లక్ష్మణ్‌, మిన్‌ లిన్‌ (మయన్మార్‌)తో పుష్పేందర్‌ తలపడనున్నారు. మహిళల ఛాంపియన్‌షిప్‌ బరిలో  మిగిలిన ఏకైక భారత క్రీడాకారిణి  అమీ కమాని సెమీస్‌ చేరింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు