close

క్రీడలు

ఐపీఎల్‌ @ రూ.48వేల కోట్లు

ముంబయి

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) బ్రాండ్‌ విలువ దాదాపు రూ.48 వేల కోట్ల (6.8 బిలియన్‌ అమెరికా డాలర్లు)కు చేరింది. ఈ ఏడాది ఈ విలువ 13.5 శాతం పెరిగిందని డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ నివేదిక గురువారం వెల్లడించింది. మరోవైపు షారుఖ్‌ ఖాన్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్రాండ్‌ విలువ చెరో ఎనిమిది శాతం తగ్గింది. 2008లో ఎనిమిది జట్లతో ఆరంభమైన ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాలుగు సార్లు టైటిల్‌ సొంతం చేసుకున్న ముంబయి ఇండియన్స్‌ బ్రాండ్‌ విలువ 8.5 శాతం పెరిగి రూ.809 కోట్లకు చేరింది. ఐపీఎల్‌లో అత్యధిక బ్రాండ్‌ విలువ కలిగి ఉన్న జట్టు ఇదే. రెండో స్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఉంది. 13.1 శాతం పెరిగిన దాని విలువ రూ.732 కోట్లకు చేరింది. దిల్లీ క్యాపిటల్స్‌ విలువ 8.9 శాతం పెరిగి రూ.374 కోట్లుగా మారింది. రాజస్థాన్‌ రాయల్స్‌ విలువ ఏడాది వ్యవధిలో రూ.284 కోట్ల నుంచి రూ.271 కోట్లకు తగ్గింది. ‘‘జట్టు యాజమాన్యాలు ఎంత ప్రభావవంతంగా, పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయోననే విషయాలు కూడా బ్రాండ్‌ విలువ హెచ్చుతగ్గుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా బ్రాండ్లకు ఆదాయాన్ని సమకూర్చే వ్యాపార రంగంలోని అవకాశాలను ఐపీఎల్‌ పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడం లేదు’’ అని నివేదిక పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు