close

ఆంధ్రప్రదేశ్

4 నుంచి గోఆధారిత వ్యవసాయదారుల సమ్మేళనం

లబ్బీపేట (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: గోఆధారిత, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని మరింత మంది రైతులు అనుసరించేలా చేయడమే తమ లక్ష్యమని గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడారు. అక్టోబర్‌ 4, 5, 6 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం, 4న దక్షిణ భారత గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం, 5,6 తేదీల్లో సిరిధాన్యాల వంటల పోటీలు, ఆరోగ్య సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రైతు నేస్తం ఛైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిరిధాన్యాలు, అరుదైన విత్తనాలు, గోఆధారిత, సేంద్రియ ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలను ప్రదర్శిస్తామన్నారు. సంఘం కోశాధికారి వల్లభనేని ఆశాకిరణ్‌, సభ్యుడు ఏవీఆర్‌కే చౌదరి పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు