close

ఆంధ్రప్రదేశ్

వైద్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలి..

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసు నిషేధానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వ వైద్యుల సంఘం ఖండించింది. ఎన్టీఆర్‌ హయాంలో నిషేధం విధించగా కొంత మంది సీనియరు వైద్యులు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకుని ప్రైవేటు రంగానికి మళ్లారని సంఘం నేతలు తెలిపారు. వైఎస్‌ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు ముగిసిన అనంతరం వైద్యులు సొంతంగా ప్రాక్టీసు చేయడానికి అనుమతించారని పేర్కొన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ వైద్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలని వైద్యుల సంఘం కన్వీనర్‌ జయధీర్‌ గురువారం ఓ ప్రకటనలో సూచించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు