close

ఆంధ్రప్రదేశ్

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో 950 కి.మీ. రహదారుల విస్తరణ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో రహదారుల విస్తరణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) పలు మార్గాలు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో 950 కిలోమీటర్ల ఈ రహదారుల విస్తరణకు రూ.30 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. నిర్మించు, నిర్వహించి, అప్పగించు విధానంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. నాలుగు లేదా ఆరు వరుసల నిర్మాణానికి వార్షిక ముందస్తు అర్హత(ప్రీక్వాలిఫికేషన్‌) ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే ఆహ్వానించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు