close

ఆంధ్రప్రదేశ్

సింగరేణి కార్మికులకు రూ. 1,00,899 బోనస్‌

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్‌ ప్రకటించింది. సంస్థ లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు అందజేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం శాసనసభలో ప్రకటించారు. ప్రతి కార్మికుడికి రూ. 1,00,899 బోనస్‌ అందనుందని పేర్కొన్నారు. ఇది దసరా సందర్భంగా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుకని తెలిపారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు