close

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం ఒకటో యూనిట్‌లో అంతరాయం

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలోని ఒకటో యూనిట్‌లో ఈ నెల 17న సాంకేతిక సమస్య తలెత్తి విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. ఈ కేంద్రంలో మొత్తం 7 యూనిట్లున్నాయి. వాటినుంచి రెండు నెలలుగా నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత అన్ని యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంతో చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహారావు చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు