close

ఆంధ్రప్రదేశ్

తితిదే పాలకమండలిలో గిరిజనులకు స్థానం ఏదీ?

టీఎస్‌ఎఫ్‌ ఆవేదన

తాడేపల్లి, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో గిరిజనులకు స్థానం కల్పించకపోవడంపై ట్రైబల్‌ స్టూడెంట్‌స ఫెడరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌) జాతీయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మూడావత్‌ విష్ణునాయక్‌, కరంసీ అక్కలప్పనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. తితిదే దేవస్థానంతో గిరిజనులకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, హాథీరామ్‌జీ మఠమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. జగన్‌ గెలుపునకు ఎస్టీ నియోజకవర్గాల్లో గిరిజనులు విశేష కృషిచేశారని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు