close

ఆంధ్రప్రదేశ్

తెలుగు అధ్యయన కేంద్రం ఏర్పాటుకు స్థలపరిశీలన

నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే:  నెల్లూరు జిల్లాలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటుకు నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం గురువారం స్థల పరిశీలన చేపట్టింది. విక్రమసింహపురి వర్సిటీ, స్వర్ణభారత్‌ట్రస్టులోని బీవీరాజు నైపుణ్యాభివృద్ధి కేంద్రం, బిల్డింగ్‌ మెటీరియల్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌ సంస్థ భవనం, కసుమూరు రోడ్డులో ఎన్‌సీఆర్‌టీ నిర్మాణానికి కేటాయించిన 50.5 ఎకరాల స్థలాలను పరిశీలించింది. ఈ సందర్భంగా నెల్లూరులో అధికారభాషా సంఘం ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీపసాద్‌ మాట్లాడుతూ... నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆయన వెంట మైసూరు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్‌ మునిరత్నంనాయుడు ఉన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు