close

ఆంధ్రప్రదేశ్

ర్యాంకుల ఆధారంగానే సీనియారిటీ జాబితా

ఏపీ జీఏడీ ముఖ్య కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌లో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి 2013లో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు పొందిన ర్యాంక్‌ ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఏపీ సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ర్యాంకుల్ని బట్టి కాకుండా రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందించడాన్ని తప్పుపట్టింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పరీక్షలో ఎంపికైన పలువురు.. ఉమ్మడిగా ఉన్న వైద్య విధాన పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల సీనియారిటీ జాబితాకు రోస్టర్‌ పాయింట్లను ప్రామాణికంగా తీసుకున్నారు. జాబితా రూపకల్పనలో ర్యాంకుల్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ హైకోర్టును పలువురు ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా రూపొందించిన సీనియారిటీ జాబితాను రద్దు చేసింది. ర్యాంకుల ఆధారంగా దీనిని రూపొందించాలని స్పష్టంచేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు