close

ఆంధ్రప్రదేశ్

విశాఖలో అక్కినేని పురస్కార ప్రదానోత్సవం

ఫౌండేషన్‌ అధ్యక్షురాలు శారద ఆకునూరి వెల్లడి

డాలస్‌, టెక్సాస్‌: అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని డిసెంబరు 21న విశాఖపట్నంలో నిర్వహిస్తామని అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా అధ్యక్షురాలు శారద ఆకునూరి తెలిపారు. బోర్డు సమావేశంలో ఆమె ఈ విషయం వెల్లడించారు. సమావేశంలో డ్టార్‌ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం, రావు కల్వల, డాక్టర్‌ సి.ఆర్‌. రావు తదితరులు అక్కినేని నాగేశ్వరరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అక్కినేని ప్రముఖ నటుడే కాదని.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర చెప్పారు. ఇప్పటికి అయిదుసార్లు అవార్డులివ్వగా.. ఇపుడు ఆరోసారి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

పురస్కార గ్రహీతలు వీరే..
* జీవితసాఫల్య పురస్కారం: ఎం.మురళీమోహన్‌
* విద్యారత్న: ప్రొఫెసర్‌ కొలకలూరి ఇనాక్‌
* సినీరత్న: మహానటి చిత్రబృందం
* వ్యాపారరత్న: డాక్టర్‌ సూరపనేని విజయకుమార్‌
* రంగస్థలరత్న: డాక్టర్‌ శోభానాయుడు
* సేవారత్న: మనకోసం మనం ట్రస్ట్‌, చల్లపల్లి
* వినూత్నరత్న: సత్తిరాజు శంకరనారాయణ
* యువరత్న: ఫణికెర క్రాంతికుమార్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు