close

ఆంధ్రప్రదేశ్

‘వాల్మీకి’ కాదు గద్దలకొండ గణేష్‌

సినిమాపేరు మార్చిన నిర్మాతలు

హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌: ‘వాల్మీకి’ టైటిల్‌ని ‘గద్దలకొండ గణేష్‌’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌ విషయంలో ముందు నుంచీ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. లోగోలో పిస్తోల్‌ వాడడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చివరికి చిత్రబృందం లోగోనీ మార్చింది. మరోవైపు టైటిల్‌ తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ విషయమై న్యాయస్థానం చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు జిల్లాలలో ‘వాల్మీకి’ విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ చిత్ర విడుదలను ఈ రెండు జిల్లాలలో నిలిపివేశారు. దాంతో నిర్మాతలు ఈ సినిమా పేరుని ‘గద్దలకొండ గణేష్‌’గా మార్చారు. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించారు. ఇందులో వరుణ్‌ పాత్ర పేరు గద్దలకొండ గణేష్‌. అదే పేరుని ఇప్పుడు టైటిల్‌గా నిర్ణయించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు