close

ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్‌ 1 నుంచి నాణ్యమైన బియ్యం

ఈనాడు, అమరావతి: పౌరసరఫరాల శాఖ ద్వారా వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తదనుగుణంగా ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. బియ్యం పంపిణీపై సీఎం గురువారం సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యం సరఫరాపై ఆరా తీశారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని అధికారులు ఆయనకు వివరించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని రేషన్‌ బియ్యం ఖాళీ సంచులను వెనక్కి ఇచ్చేలా కార్డుదారుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. డిసెంబరు నుంచి అర్హులకు కొత్తగా రేషన్‌ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల స్థానంలో కొత్తవాటిని ఇచ్చేందుకు నమూనాలను రూపొందించాలని సీఎం సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కమిషనర్‌ కోన శశిధర్‌ పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు