close

ఆంధ్రప్రదేశ్

నాగార్జునసాగర్‌ 8.. శ్రీశైలం 4 గేట్ల ఎత్తివేత

సున్నిపెంట సర్కిల్‌, విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: శ్రీశైలానికి వరద నీరు పెరుగుతుండటంతో ఈ సీజన్‌లో మూడోసారి అధికారులు గేట్లు ఎత్తారు. గురువారం సాయంత్రానికి నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 83,949 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. సాగర్‌ వద్ద కూడా ఎనిమిది గేట్లను ఎత్తి 1,19,632 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.84 టీఎంసీలున్నాయి. ప్రస్తుతం జలాశయానికి కృష్ణా(జూరాల), తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి 1,25,801 క్యూసెక్కులు వస్తున్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాలకు 68 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. అదేవిధంగా నాగార్జునసాగర్‌ కుడి కాల్వ నుంచి 5,944 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 28,176, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 2,400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు