close

ఆంధ్రప్రదేశ్

పర్యావరణ పరిరక్షణే ధ్యేయం కావాలి: జగన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పచ్చదనం పెంచటానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకారం అందజేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యసంరక్షణ అధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ .. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల బారిన పడకుండా ప్రత్యేకబృందాలతో పహారా కాయాలన్నారు. అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రతీప్‌కుమార్‌ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం పెంచడమే లక్ష్యమని, ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటేలా చర్యలు తీసుకుంటామన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు