close

ఆంధ్రప్రదేశ్

పోలవరం ఎడమ కాలువ పనులకు 6 సంస్థల పోటీ

నేడే రివర్స్‌ టెండర్ల ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రధాన డ్యాం నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ఆరు గుత్తేదారు సంస్థలు పోటీపడుతున్నాయి. ఆ సంస్థల నుంచి టెండరు బిడ్లు దాఖలయ్యాయి. రూ.274.55 కోట్ల ఐబీఎం విలువతో జలవనరులశాఖ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈఎండీకి సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరి చూసుకుని ఈ సంస్థలు రివర్స్‌ టెండర్లలో పాల్గొనవచ్చని జలవనరులశాఖ నిర్ణయానికి వచ్చింది. పటేల్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌, మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, ఆర్‌ఆర్‌సీఐఐపీఎల్‌, డబ్ల్యుసీపీఎల్‌ సంయుక్త భాగస్వామ్యం, మేఘ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌, ఎంఆర్‌కేఆర్‌ ఎస్‌ఎల్‌ఆర్‌ సంయుక్త భాగస్వామ్యంతో మొత్తం 6 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత రివర్స్‌ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు