close

తెలంగాణ

మీరు వినే సంగీతం..  మీ ఒత్తిడిని తెలియజేస్తుంది

హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ప్రొఫెసర్‌ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: మనం వినే సంగీతం.. అది ఎప్పుడెప్పుడు వింటున్నామనే అంశాల ఆధారంగా మన మానసిక ఒత్తిడి తెలుసుకోవచ్చా..! అవుననే అంటున్నారు ట్రిపుల్‌ ఐటీ ఆచార్యురాలు ప్రొ.వినూ అల్లూరి. సాధారణంగా మనం సంగీతం వింటున్నామంటే ప్రశాంతత కోసమని భావిస్తుంటాం.  కానీ అది మానసిక ఒత్తిడి స్థాయిని తెలియజేస్తుంది.సంగీతం వింటూ కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందనే విషయాన్ని హెల్తీ-అన్‌హెల్తీ మ్యూజిక్‌ స్కేల్‌ (హెచ్‌యూఎంఎస్‌) ద్వారా తెలుసుకునే వీలుంది. ఈ ప్రత్యేక స్కేల్‌(టూల్‌)ను ఫిన్‌ల్యాండ్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ద్వారా మనం వినే సంగీతం ఆధారంగా ఒత్తిడి స్థాయి గుర్తించే వీలు కలుగుతుంది. మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో ట్రిపుల్‌ ఐటీ ఆచార్యురాలు వినూ అల్లూరి నేతృత్వంలోని బృంద సభ్యులు రజత్‌అగర్వాల్‌, రవీందర్‌సింగ్‌ సైతం హైదరాబాద్‌లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై సర్వే చేసినప్పుడు ఫిన్‌ల్యాండ్‌ తరహా ఫలితాలే వచ్చాయి. ఈ పరిశోధనను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో 600 మంది విద్యార్థులతో మరోసారి పరిశీలన చేపట్టారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు