close

గ్రేటర్‌ హైదరాబాద్‌

11 సెకన్లకో మరణం

బాలింత, గర్భిణి, శిశు మరణాలపై ఐరాస నివేదికలు

జెనీవా: కొన్ని దశాబ్దాలుగా ప్రసవ మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కానీ... ఆ గుండె కోత మాత్రం పూర్తిగా దూరం కాలేదు. నేటికీ ప్రపంచ వ్యాప్తంగా 11 సెకన్లకో గర్భిణి, బాలింత లేదా బిడ్డ తనువు చాలిస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐరాస బాలల నిధి సంస్థ (యునిసెఫ్‌) తదితర సంస్థలు ఈ వివరాలతో కూడిన రెండు తాజా నివేదికలను విడుదల చేశాయి.

తగ్గుదలకు కారణాలివి...

ప్రసవ సమయంలో నిపుణులైన వైద్యులు, సహాయకులు అందుబాటులో ఉండటం. పరిశుభ్రమైన తాగునీరు, పోషకాహారం, వైద్యం, టీకాలు సకాలంలో అందుతుండటం.
* 4,51,000: ప్రసవ సమయ సంక్లిష్టతల కారణంగా 2000లో చనిపోయిన బాలింతల సంఖ్య.
* 2,95,000: 2017లో ఇలాంటి మరణాల సంఖ్య.
* ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు సగం మేర తగ్గాయి. నిరుడు ఈ వయసు పిల్లలు 53,00,000 మంది చనిపోయారు. ఇలా కాలం చేస్తున్నవారిలో ఏటా 7,000 మంది పురుటి బిడ్డలూ ఉంటున్నారు.
* అధికాదాయ దేశాల్లో సంభవిస్తున్న ప్రసవ మరణాలతో పోల్చితే... ఆఫ్రికాలో ఇలాంటి మరణాలు 50 రెట్లు అధికం.

28,00,000

పరిష్కరించదగ్గ సమస్యలతో ఏటా చనిపోతున్న బాలింతలు, పురుటి బిడ్డల సంఖ్య.

2030

ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యం
ప్రతి లక్ష ప్రసవాల్లో సంభవించే మరణాలను గరిష్ఠంగా 70కి పరిమితం చేయడం.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు