close

ఆంధ్రప్రదేశ్

సచివాలయ వ్యవస్థతో సంక్షేమ ఫలాలు

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

కరప, న్యూస్‌టుడే: ప్రజలకు సంక్షేమ ఫలాలను సక్రమంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ప్రారంభసూచికగా తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాన్ని అక్టోబరు2న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మంత్రులు బోస్‌, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌లు గురువారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కరప పంచాయతీ కార్యాలయాన్ని వలసపాకలలో సభాస్థలిని పరిశీలించారు. కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ నగరం, రామచంద్రపురం ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు