close

ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత

చెన్నైలో చికిత్స

ఈనాడు-తిరుపతి: చిత్తూరు మాజీ ఎంపీ ఎం.శివప్రసాద్‌ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవల వెన్నెముక, శ్వాసకు సంబంధించిన సమస్య ఎదురైంది. కొద్దిరోజుల పాటు తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకు తీసుకెళ్లారు. వారం రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు