close

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ఒత్తిడి వల్లే కోడెల ఆత్మహత్య: బొత్స

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చంద్రబాబు ఒత్తిడివల్లే మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘గత 3 నెలల్లో కోడెల మిమ్మల్ని ఎన్నిసార్లు కలిశారు? ఆయనెందుకు భాజపాలో చేరాలనుకున్నారు? ఆయనపై అభాండాలను పార్టీపరంగా ఎందుకు ఖండించలేదు’ అని ప్రశ్నించారు.

వీటికేం సమాధానం చెబుతారు: అంబటి, గోపిరెడ్డి
కోడెల మృతికి దారితీసిన పరిస్థితులు, ఆయన, ఆయన కుటుంబసభ్యుల అరాచకాలు, మొత్తంగా మీ పాత్రపై సీబీఐ విచారణ కోరండని తెదేపా అధినేత చంద్రబాబుకు వైకాపా ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు సూచించారు. గురువారం వీరిద్దరూ చంద్రబాబుకు ప్రశ్నలు సంధిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గత మూడు నెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా? కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలొచ్చినపుడు ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లారా? చనిపోకముందు కోడెల మీకెప్పుడైనా ఫోన్‌ చేసి తనను ప్రభుత్వం వేధిస్తుందని చెప్పారా? చెబితే మీరెందుకు స్పందించలేదు? గత అయిదేళ్లుగా కోడెల కుమారుడు, కుమార్తె కె-ట్యాక్స్‌ వసూలు చేశారా? లేదా? సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వబోమంటూ జీవో జారీ చేసిన మీకు ఆ సంస్థపై ఎప్పుడు నమ్మకం కుదిరింది?’ అని ప్రశ్నించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు